పశ్చిమబెంగాల్లో దారుణం చోటు చేసుకుంది. 24 పరగణాల జిల్లాలో ట్యూషన్‌కు వెళ్లిన బాలికను ఘోరంగా హత్య చేశారు. బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మహిషామరి సౌత్ 24 పరగణాల జిల్లాలో శుక్రవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం బాలిక మృతదేహం వెలుగుచూసింది.
మోస్తకిర్ సర్దార్ అనే అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను అత్యాచారం చేసి, హత్య చేశారంటూ కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ విమర్శించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని పాలనపై మమతా బెనర్జీకి పట్టు లేదని, దేవీ నవరాత్రుల వేళ బాలికలు, మహిళలపై హత్యాచారాలు పెరిగిపోయాయని కేంద్ర మంత్రి మజుందార్ విమర్శించారు. బాలిక హత్యతో ఆ ప్రాంతంలో బాధితులు నిరసనలు చేపట్టారు.