మహిళల టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో భారత జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. గ్రూప్ ‘ఎ’ లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ 58 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుక సింగ్ రెండు వికెట్లు తీయగా, ఆశ శోభన, అరుంధతి రెడ్డి చెరొక వికెట్ తీశారు.
కెప్టెన్ సోఫీ డివైన్, 36 బంతులు ఆడి 57 పరుగులతో అజేయంగా నిలవగా ఓపెనర్లు జార్జియా ప్లిమ్మర్ (34), సుజీ బేట్స్ (27) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్ష్య ఛేదనలో భారత్ 19 ఓవర్లలో 102 పరుగులకే పెవిలియన్ చేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (15)దే అత్యధిక స్కోరుగా ఉంది.
కివిస్ బౌలర్లు రోజ్మేరీ మైర్ నాలుగు వికెట్లు తీయగా , లియా తహుహు ముగ్గురిని ఔట్ చేశారు. ఈడెన్ కార్సన్, 34 పరుగులు ఇచ్చి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో భారత్ 19 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. టోర్నీలో భాగంగా రెండో లీగ్ మ్యాచ్‌లోను పాకిస్తాన్‌తో భారత్ ఆడనుంది.