తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు స్వామివారిని మాడవీధుల్లో చినశేష వాహనంపై ఊరేగించారు. శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులను అభయ ప్రధానం చేశారు. కొద్ది సేపటి కిందటే ఊరేగింపు ముగిసింది.
మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్వపన తిరుమంజనం, సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు హంస వాహన సేవ జరగనుంది. చినశేషవాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగం సిద్ధిస్తుందని ప్రశస్తి.
చిన్నశేషుడుని వాసుకిగా భావిస్తుంటారు. పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ సంప్రదాయాల ప్రకారం శేషి, ప్రపంచం శేషభూతం, శేష వాహనం శేషిభావాన్ని సూచిస్తుంది. అందుకే చిన్నశేషవానాన్ని దర్శించుకుంటే భక్తులకు కుండలినీయోగం కలుగుతుందని భక్తుల నమ్మకం.