హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 90 స్థానాలకు 1031 మంది బరిలో నిలిచారు.20632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. 75 శాతంపైగా పోలింగ్ జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 10 గంటల సమయానికి 32 శాతం పోలింగ్ నమోదైంది.
హర్యానా చిన్న రాష్ట్రమైనా, అక్కడి అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. పదేళ్లుగా హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండటంతో వ్యతిరేకత తప్పడం లేదు. కుల సమీకరణాలు కూడా బీజేపీకి ఈసారి కలిసివచ్చేలా కనిపించడం లేదు. హర్యానాలో అధికార మార్పిడి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వేల ద్వారా తెలుస్తోంది.