జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.నవరాత్రుల్లో నేడు రెండోరోజున అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. భ్రమరాంబ అమ్మవారు మల్లికార్జున స్వామివార్లు మయూర వాహనంపై విహరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు.
నవదుర్గలలో రెండోవ స్వరూపం బ్రహ్మచారిణి. ఈ తల్లిని శరన్నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు. ఈ అమ్మవారి కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం ధరించి ఉంటారు. బ్రహ్మచారిణిలో బ్రహ్మ శబ్దార్థాన్ని తపస్సుగా పేర్కొంటారు. తపస్సును ఆచరించే బ్రాహ్మీ స్వరూపం అని అర్థంగా పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవిని అర్చించడంతో సంఘర్షణల సమయంలో మనస్సు కల్లోలం కాకుండా ఉంటుంది. అన్ని విషయాల్లో విజయం లభించడంతో పాటు రుణబాధలు తొలుకుతాయి. ఈ అలంకారంలో అమ్మవారిని అర్చించడంతో విశేష ఫలితాలు లభిస్తాయి.
శరన్నవరాత్రుల్లో భాగంగా తొలిరోజు శైలిపుత్రిగా అమ్మవారు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భాగంగా ఆదిదంపతులు బృంగి వాహనంపై విహరించి భక్తులను కటాక్షించారు.