ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై ఏపీ హోటళ్ల సంఘం నిషేధం విధించింది. తమకు రావాల్సిన బకాయిలు స్విగ్గీ సకాలంలో చెల్లించడం లేదని ఏపీ హోటళ్ల సంఘం అధ్యక్షుడు ఆర్వీ స్వామి తెలిపారు. స్విగ్గీ, జొమాటో యాజమాన్యాల తీరు వల్ల హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించేందుకు జొమాటో అంగీకరించిందని గుర్తుచేశారు.
స్విగ్గీపై నిషేధం ఈ నెల 14 నుంచి అమల్లోకి రానుంది. ఈ లోగా సమస్యను పరిష్కరిస్తే హోటళ్ల యాజమాన్యాలు దిగివచ్చే అవకాశముంది. లేదంటే స్విగ్గీకి సరఫరా నిలిచిపోనుంది.