దండకారణ్యంలో మరోసారి భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నారాయణ్‌పుర్- దంతెవాడ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకోగా ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
బస్తర్ రేంజ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా దళాల రాకను పసిగట్టిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగాల్సివచ్చింది.
ఘటనాస్థలంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.