ప్రపంచ కుబేరుల జాబితా విడుదలైంది. తాజాగా బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో మెటా సీఈవో 206 బిలియన్ డాలర్ల సంపదతో మార్క్ జుకర్ బర్గ్ రెండో స్థానంలో నిలిచారు. 205 బిలియన్ డాలర్ల సంపదతో బెజోస్ మూడో స్థానానికి పడిపోయారు.
కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ హవా కొనసాగుతోంది. ఆయనకు సమీపంలో ఎవరూ లేరు. 256 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. మన దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మొదటి 20 స్థానాల్లో చోటు సాధించారు. 107 బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, 104 బిలియన్ డాలర్లతో అదానీ 17 స్థానంలో కొనసాగుతున్నారు.
ఇటీవల మెటా షేర్లు 23 శాతం పెరగడంతో జుకర్ బర్గ్ సంపద భారీగా పెరిగింది. మెటా షేరు 582 అమెరికా డాలర్లకు చేరింది. ఏఐ డేటా సెంటర్లపై మెటా భారీ పెట్టుబడులు పెడుతోంది. రాబోయే రోజుల్లో మెటా సీఈవో సంపద మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.