మహారాష్ట్ర సచివాలయంలో పెను ప్రమాదం తప్పింది. ధంగర్ గిరిజన తెగను షెడ్యూల్డ్ కులాల్లో చేర్చడాన్ని నిరసిస్తూ ముంబైలోని ప్రధాన సచివాలయ భవనంలో అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యేలతో, డిప్యూటీ స్పీకర్ నరహరి జర్వాల్ నిరసన చేపట్టారు. నిరసనకు దిగిన ఎమ్మెల్యేలు, డిప్యూటీ స్పీకర్ సచివాలయ భవనం మూడో అంతస్తు నుంచి దూకారు. సేఫ్టీ నెట్ కట్టి ఉండటంతో ప్రమాదం తప్పింది.
గిరిజన ధంగర్ తెగను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.