బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ లో భాగంగా పోలీసులు ఆయనను విచారించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో బెయిలో కోరుతూ నందిగం సురేశ్, హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం విచారించింది. కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున సురేశ్‌కు బెయిల్ ఇవ్వద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి,తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
గుంటూరు జైలులో ఉన్న సురేశ్, రిమాండ్ గురువారంతో ముగియడంతో మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయన రిమాండ్ ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు నేడు వెల్లడించిన తీర్పులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.