ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్థిక సేవల సంస్థ గూగుల్‌పే (జీపే) ద్వారా బంగారు రుణాలు అందజేసేందుకు ముత్తూట్ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అందుబాటులోని వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవచ్చు అని గూగుల్ ఇండియా ఎండీ రోమా దత్తా చోబే తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా 10వ ఎడిషన్ కార్యక్రమంలో
ఈ విషయాన్ని వెల్లడించారు.
గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ సేవలు హిందీలోనూ ప్రారంభించారు. తెలుగు, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లో సహాయ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
కొద్ది నెలల్లో జెమినీ ఫ్లాష్ 1.5ను గూగుల్ ఆవిష్కరించనుంది. అంతర్జాతీయంగా ఉన్న అతికొద్ది ప్లాట్‌ఫారాలలో ఇదీ ఒకటి. దీని ద్వారా సంస్థలు తమ క్లౌడ్, ఏఐ సొల్యూషన్లను భద్రంగా అమలు చేయొచ్చు.