రైల్వే ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. రైల్వే ఉద్యోగులకు బోనస్‌తో పాటు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ సీడ్స్’కు ఆమోదం తెలిపింది.మొత్తం 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు గాను రూ.2028.57 బోనస్ ప్రకటించింది. అలాగే రాబోయే ఆరేళ్లలో నూనెగింజల ఉత్పత్తికి రూ.10,103 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. వంట నూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. మరాఠీ, పాళి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా ఇవ్వాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. తెలుగు సహా ఆరు భాషలకు ఇప్పటికే ప్రాచీన హోదా దక్కింది.
చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఫేజ్-2లో భాగంగా రూ.63,246 కోట్లతో 119కిలోమీటర్ల మేర ఈ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 120 స్టేషన్లు నిర్మించనున్నారు.