కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగింపుగా విహరించి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందుగా అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది.శ్రీవారి ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి,మట్టిని సేకరిస్తారు. దీనినే పుట్టమన్ను సేకరణ అంటారు.ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పిలుస్తారు.
వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వృద్ధులు, వికలాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, చిన్నారుల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.