ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని బొత్తలంక, ఎరపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో ఇరువర్గాల మధ్య హోరాహోరీగా బుల్లెట్ ఫైట్ జరిగింది. నక్సల్స్ కాల్పులను భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోకి భద్రతా బలగాలు ప్రవేశించాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పలువురు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు.
డీఆర్జీ, సీఆర్పీ ఎఫ్, కోబ్రా దళాలకు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్, సీఆర్పీ ఎఫ్ డీఐజీ ఆనంద్, కుంట డీఐజీ సూరజ్‌పాల్ వర్మలు ఎప్పటి కప్పుడు ఎన్ కౌంటర్ సమాచారం తెలుసుకుంటూ సబ్ ఆర్డినేట్స్ కు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.