ఈషా ఫౌండేషన్‌పై తమిళనాడు పోలీసులు చేపట్టిన చర్యలను ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చెన్నై హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కోయంబత్తూరు సమీపంలో ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తోన్న ఆశ్రమంలో తన ఇద్దరు కుమార్తెలను బంధించి చిత్ర హింసలకు గురిచేస్తున్నారంటూ తమిళనాడుకు చెందిన
విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ చెన్నై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన హైకోర్టు తనిఖీలు జరపాలని ఆదేశించింది.
స్పందించిన తమిళనాడు పోలీసులు ఈషా ఫౌండేషన్లో అన్ని గదులు తనిఖీలు నిర్వహించారు. దీనిపై ఫౌండేషన్ ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సన్యాసినులుగా మారాలని, పెళ్లి చేసుకోవద్దని తాము ఎవరినీ కోరమని కోర్టుకు విన్నవించారు. ఇది వారి వ్యక్తిగతమన్నారు. ఈషా ఫౌండేషన్ తరపును సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చెన్నై హైకోర్టు తీర్పుపై స్టే విధించారు.