వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడిగిస్తూ మంగళగిరి కోర్టు తీర్పు వెలువరించింది. నేటితో నందిగం సురేష్ రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగించారు.
మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కారణమంటూ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. 2021 అక్టోబరు 18న
దాదాపు 120 మంది దుండగులు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీనిపై అప్పట్లో పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.