ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 7న సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలవనున్నారని సీఎం కార్యాలయం తెలిపింది. అమరావతి రాజధానికి నిధులు, పోలవరం నిధులు, రైల్వే జోన్ ఇతర అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశముందని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి వెంట పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం విషయంలో కేంద్రం నుంచి మద్దతు కోరే అవకాశముంది. వచ్చే నెల మొదటి వారంలో ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.