అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటోంన్న డాన్స్ మాస్టర్ షేక్ జానీ భాషాకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎంపికైన జానీ మాస్టర్ ఢిల్లీలో అవార్డు తీసుకోవాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏకీభవించిన న్యాయమూర్తి నాలుగు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు.
జానీ మాస్టర్ తన వద్ద పనిచేసే యువతిపై 2019 నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. జానీ వద్ద సహాయ నృత్య దర్శకురాలిగా చేస్తోన్న తనపై ఐదేళ్లుగా పలుసార్లు అత్యాచారం చేసినట్లు యువతి ఫిర్యాదు చేసింది. తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. బయట చెబితే సినిమా పరిశ్రమలో లేకుండా చేస్తానని బెదించాడని ఆమె చెబుతోంది.