పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. ప్రారంభంలోనే
1264 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ తరవాత కొద్దిగా కోలుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపించడంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. దీంతో సెన్సెక్స్ 693 పాయింట్లు నష్టపోయి 83572 వద్ద ట్రేడవుతోంది, నిఫ్టీ 211 పాయింట్ల నష్టంతో 25585 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో 23 కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, మారుతి సుజుకీ,రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. జిందాల్ స్టీల్, టాటా స్టీల్ నష్టాల్లో నడుస్తున్నాయి. రూపాయితో డాలరు మారకం విలువ 83.91 వద్ద కొనసాగుతోంది.