ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. గాయాలతో ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు దుండగులు
ఓ డాక్టరు వద్ద చికిత్స చేయించుకున్నారు. గాయాలతో ఆసుపత్రికి వచ్చిన వారికి డ్రెస్సింగ్ చేసి వైద్యం చేశారు. తరవాత డాక్టర్ గదిలోకి వెళ్లారు. కాసేపటికే దుండగుల అసలు రూపం బయట పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఢిల్లీలోని నిమా ఆసుపత్రిలో గురువారం దారుణం జరిగింది. ఇద్దరు యువకులు గాయాలతో ఆసుపత్రికి వచ్చారు. అందుబాటులో ఉన్న డాక్టర్ వారికి వైద్యం చేశారు. కాసేపటికే డాక్టర్ గదిలోకి ప్రవేశించిన దుండగులు తుపాకీలతో కాల్పులు జరిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో డాక్టర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దుండగలు కాల్పులు జరిపిన సమయంలో రికార్డైన సీసీటీవీ విజువల్స్ వైరల్ అయ్యాయి.