హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. లెబనాన్ నగరం బీరుట్ నడిబొడ్డున రాకెట్లతో ఇజ్రాయెల్ సేనలు దాడికి దిగాయి. సెంట్రల్ బీరుట్‌లోని పార్లమెంట్ భవనానికి సమీపంలో ఓ భవనం లక్ష్యంగా గురువారం ఉదయం ఈ దాడి జరిగింది. బచౌరా ప్రాంతంలో లెబనాన్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు చనిపోయారు.
బీరుట్‌పై కచ్చితమైన వైమానిక దాడిని జరిపినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ బలగాలు దాడులకు దిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ముందుగా హెచ్చరికలు జారీ చేసి దాడలు చేశారు. బీరుట్ నగరంలో ఇజ్రాయెల్ దాడులు జరపడం 2006 తర్వాత ఇదే తొలిసారి.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రపంచ స్థిరత్వానికి హానికరమైన ఇరాన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న కష్టతరమైన యుద్ధంలో పతాక స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ను ఇరాన్ నాశనం చేయాలనుకుంటోందని అది జరగదని అన్నారు.