మార్కెట్ లో విగ్రహం విలువ రూ. 8 కోట్లు
కాంచీపురం శ్రీ ఏకాంబరేశ్వరర్ ఆలయానికి చెందిన సోమస్కంధర్ విగ్రహం అమెరికాలో ఉన్నట్లు తేలింది. దీని విలువ సుమారు రూ. 8 కోట్లు ఉంటుందని అంచనా. 18 వ శతాబ్దానికి చెందినదిగా తేలింది.
తమిళనాడు లోని ఆలయాల నుంచి చోరీ చేసి విదేశాల్లో అక్రమంగా విక్రయించిన పురాతన విగ్రహాల్లో సోమస్కందర్ విగ్రహం కూడా ఒకటి. విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ఐజీ దినకరన్ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ విషయం తేలింది.
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని మ్యూజియంలో ఓ కాంస్య విగ్రహం ఉన్నట్లు తెలిసింది. ఈ విగ్రహం కాంచీపురం ఏకాంబరేశ్వరర్ ఆలయానికి చెందినదిగా సదరు మ్యూజియం వెబ్సైట్లో పేర్కొన్నారు.
విగ్రహం పీఠంపై తెలుగు లిపి ఉంది. విగ్రహాన్ని దానం చేసిన దాత పేరుతో పాటు ఇతర వివరాలు ఉన్నాయి. విగ్రహాన్ని భారత్ కు తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.