ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ‘జన్ సురాజ్ పార్టీ’ని ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఎన్నికల సంఘం నుంచీ ఆమోదం పొందిందని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. బిహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు.
గత 30 ఏళ్ళుగా బిహార్ ప్రజలు ఆర్జేడీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ప్రస్తుతం ఈ సంప్రదాయం అంతం కావాలన్నారు. తమ పార్టీ రాజవంశానికి చెందినది కాదు అన్నారు.
బిహార్ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పు రావాలన్న పీకే, ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించేందుకు రాబోయే పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసరమవుతాయని చెప్పారు.