హిజ్బుల్లా అధినేత నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఇజ్రాయెల్‌పైకి బుధవారం రాత్రి ఏకంగా 200లకు పైగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈఘటన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్ నుంచి ఎవరూ అనవసరంగా ఇరాన్‌కు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితులు చక్కబడే వరకు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారతీయ పౌరులకు హితవు పలికింది. ఇరాన్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అత్యవసరమైతే టెహ్రాన్‌లోని భారత ఎంబసీని సంప్రదించాలని సూచించింది.