చైనాతో ఉద్రిక్తతల సంక్లిష్ట స్వభావాన్ని వివరిస్తూ, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ‘‘భారతదేశం చైనాతో పోటీ పడాలి, సహకరించుకోవాలి, కలిసి మనుగడ సాగించాలి, ఘర్షణ పడాలి, వివాదాలు ఎదుర్కోవాలి’’ అని వివరించారు. చైనా విషయంలో మా మనసుల్లో కొంతకాలం నుంచి ఎలాంటి మొహమాటమూ లేదని స్పష్టం చేసారు.
‘‘చైనాతో సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. అయితే అవి సాధారణంగా లేవు, సున్నితంగా ఉన్నాయి. భూమిని ఆక్రమించిన విషయంలో కానీ, బఫర్ జోన్ల ఏర్పాటు విషయంలో కానీ, 2020 ఏప్రిల్‌కు ముందునాటి పరిస్థితి పునరుద్ధరించబడాలని కోరుకుంటున్నాం’’ అని ఉపేంద్ర ద్వివేదీ చెప్పారు. ‘‘ఆ పరిస్థితి పునరుద్ధరణ జరిగే వరకూ చైనాతో వ్యవహారం సున్నతంగానే ఉంటుంది. మేం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి, ఎలాంటి కార్యాచరణనైనా చేపట్టడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాం. విశ్వాసానికి అతిపెద్ద దెబ్బ తగిలింది కదా’’ అని వ్యాఖ్యానించారు.
ఇరుదేశాల మధ్యా ఈ యేడాది ఏప్రిల్ నుంచీ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయని ద్వివేదీ గుర్తు చేసారు. ‘‘మనం చాలాదూరం వచ్చేసాం. మనకొక సంక్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు, ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించాల్సి ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
2020 మే నెలలో చైనా బలగాలు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోకి చొరబడి అక్కడ వాస్తవాధీన రేఖ వద్ద అమల్లో ఉండే యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నాలు చేసాయి. అప్పటినుంచీ భారతదేశం వాస్తవాధీన రేఖ వెంబడి ఫార్వర్డ్ పోస్ట్‌ల దగ్గర 50వేల మందికి పైగా సైనికులను మోహరించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు