భారత వాతావరణ విభాగం అంచనా
అక్టోబర్ నుంచి డిసెంబరు మధ్య ఈశాన్య రుతుపవనాల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. మధ్య, దక్షిణభారత రాష్ట్రాలతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో మంచి వానలు పడతాయని, అక్టోబరు నెలలో మధ్య, దక్షిణ భారతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. వర్చువల్‌గా విలేకరులతో జరిగిన సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు.
తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక దక్షిణ ప్రాంతాలు సహా, మధ్య భారతంలో సాధారణాన్ని మించి అంటే 112 శాతం వర్షాలు కురుస్తాయని వివరించారు. వాయవ్య భారతం, ఈశాన్యల, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చు అని స్పష్టంగా పేర్కొన్నారు.
నైరుతి రుతుపవన కాలంలో దేశంలో సాధారణాన్ని మించి 7.6 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో అధిక వర్షపాతం నమోదైంది.