ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు గాను రూ.5,858.60 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించింది.
తెలంగాణకు రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను విడుదల చేయగా మహారాష్ట్రకు అత్యధికంగా రూ.1,432 కోట్లను ఇచ్చింది. గుజరాత్‌కు రూ.600 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లను కేటాయించినట్లు కేంద్రం వివరించింది. . రాష్ట్ర విపత్తు నిధికి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్రం వాటాగా ఈ మేరకు నిధులను విడుదల చేసినట్లు స్పష్టం చేసింది.
ఇటీవల భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కేరళ సహా పలు వరద ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర అధికారుల బృందాలు పర్యటించాయి. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ నివేదిక ఇచ్చాయి. దీంతో తక్షణ సాయంగా కేంద్ర హోంశాఖ ఈ నిధులు మంజూరు చేసింది.