భారతదేశంలో మొదటిసారి పర్యటిస్తున్న జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ ఈ ఉదయం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. జమైకా-భారత్ ప్రధానమంత్రుల ద్వైపాక్షిక సమావేశం జరగడం ఇదే మొదటిసారి.
నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు జమైకా ప్రధానమంత్రి భారత పర్యటనకు మొదటిసారి వచ్చారు. నిన్న సోమవారం నుంచి గురువారం వరకూ ఆయన భారత్‌లో పర్యటిస్తారు. ఇవాళ రాజ్‌ఘాట్‌లో మహాత్ముడి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఈ పర్యటనలో ఆండ్రూ హోల్నెస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లను మర్యాదపూర్వకంగా కలుస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో బృంద స్థాయి చర్చల్లో పాల్గొంటారు. వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారం గురించి ఇరు దేశాల అధినేతల మధ్యా కొన్ని అవగాహనా ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది.