జమ్మూకశ్మీర్ శాసనసభకు మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల్లో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ప్రజలు తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఆఖరి దశ పోలింగ్ లో భాగంగా 40 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
దశాబ్దాల తర్వాత ఓటు వేసే హక్కు తమకు దక్కిందని వాల్మీకి సామాజికవర్గ ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా తమ సామాజిక వర్గానికి మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తున్నామని చెప్పారు. సమాజంలో తమ సామాజిక వృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని కోరుకుంటున్నామన్నారు.ఆర్టికల్ 370ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం మంచి పనిచేసిందన్నారు.
జమ్మూ ప్రాంతంలో 24 స్థానాలు, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో 415 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 39.18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 370 రాజ్యాంగ అధికరణం రద్దు తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలకు చెందిన ప్రజలు ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్నారు.