ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది. వైసీపీ పాలనలో జగనన్న తోడు పేరుతో అమలైన పథకం పేరును మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే పలు పథకాల పేరు మార్చిన ప్రభుత్వం, ‘జగనన్న తోడు’ పథకాన్ని ‘‘చిరువ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’’ గా మార్చింది. ఈస్కీమ్ పేరు మార్పు కోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.
గత వైఎస్ జగన్ ప్రభుత్వం చిరువ్యాపారులు, చేతివృత్తుల వారు, హస్త కళాకారుల కోసం ‘జగనన్న తోడు’ పథకం కింద రూ. 10వేల ఆర్థిక సాయం అందజేసింది. అర్హులకు ప్రతీఏటా వడ్డీలేని రుణం కింద రూ.10 వేలు అందజేసింది.