భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందజేసే పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు., లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులు, ఇప్పటివరకు అందిన సాయంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి గాను రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు వివరించారు.
రైతులకు పంట నష్టపరిహారం కింద జరిపే చెల్లింపులు రూ.301 కోట్లు కాగా మిగిలిన మొత్తం ఇళ్ళు, దుకాణాలు మునిగడం కారణంగా ఆస్తి నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు.
ప్రభుత్వం బాధితుల అకౌంట్లకు నగదు డీబీటీ పద్ధతిలో అందజేయగా అందులో 97 శాతం మంది లబ్ధిదారుల అకౌంట్లకు పరిహారం జమ అయినట్లు పేర్కొన్నారు.
అయితే 22,185 మంది లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ అవ్వలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతీ ఒక్కరికీ పరిహారం అందజేయాలని ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు ఆదేశించారు.
వచ్చే శుక్రవారం నాటికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చేయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్షలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.