భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, తనపై వస్తున్న ఆరోపణలను ఓ ప్రకటన ద్వారా ఖండించారు. తనది నియంతృత్వ ధోరణి అంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి లేఖ రాసిన 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని నొక్కిచెప్పారు. ఎగ్జిక్యూటివ్ సభ్యుల్లో కొందరు అవినీతి, లింగ వివక్ష, లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఈవోగా రఘురామ్ అయ్యర్ నియామకంపై ఉష తీరును సభ్యులు తప్పు పట్టారు. ఆమెది నిరంకుశ ధోరణి, నియంతృత్వ పోకడ అంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జెరొమె పొయివేకు లేఖ రాశారు. అయ్యర్ ఎన్నికపై తాము రెండు సార్లు సమావేశం అయ్యామని, రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం రాలేదని ప్రకటనలో వివరించింది.