దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు,విజయగాదలు, స్ఫూర్తిదాయకమైన కథనాలను మన్‌కీబాత్ ద్వారా దేశం మొత్తం తెలుసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు.‘మన్ కీ బాత్’ ప్రారంభించి పదేళ్ళు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ ఎపిసోడ్ తనకు భావోద్వేగమైనదని మోదీ వెల్లడించారు. సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదికగా ఈ కార్యక్రమం మారిందని వివరించారు.
సాధారణంగా మసాలాలేని కంటెంట్‌ను ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయం ఉండేదని, మన్ కీ బాత్ ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించిందన్నారు.20 వేల భాషలకు భారత్ పుట్టినిల్లు అని పేర్కొన్న మోదీ, దేశంలో వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు.
భారత్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ప్రారంభించి పదేళ్ళు పూర్తయిందని ప్రధాని మోదీ అన్నారు. దీంతో ప్రతీ రంగంలోనూ ఎగుమతలు పెరిగాయని, FDIలను ఆకర్షించడంలో ప్రభుత్వం పురోగతి సాధించిందని వివరించారు. స్థానిక తయారీదారులకు మేకిన్ ఇండియా సాయపడిందన్నారు.2014 అక్టోబర్3న మొదటి సారి మన్‌కీ భారత్ కార్యక్రమం ప్రారంభించిందని మోదీ గుర్తు చేశారు.