విద్యాసంస్థలకు దసరా సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 3 నుంచే సెలవులు ఉంటాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అక్టోబరు 4 నుంచి 13 వరకు సెలవులు ఇవ్వాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే తెలంగాణలో అక్టోబరు 3 నుంచే ఇస్తున్నారనే విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్టోబరు 3 నుంచే దసరా సెలవుల ప్రతిపాదనకు లోకేశ్ ఓకే చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మేరకు విద్యార్థులకు 12 రోజులు సెలవులు లభిస్తాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి కావడంతో మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సెలవుల విషయాన్ని వెల్లడించారు.