భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సీరీస్‌లో భాగంగా కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ రెండోరోజు ఆట ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దయిపోయింది.
ఈ మ్యాచ్‌ను భారత్ గెలవలేకపోతే, ఇంగ్లండ్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో హ్యాట్రిక్ సాధించడం భారత్‌కు కష్టసాధ్యమవుతుంది. న్యూజీలాండ్‌తో అక్టోబర్ 16 నుంచి జరిగే 3 మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్, ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి జరిగే 5మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్ రెండింటిలోనూ భారీ స్కోర్లు, భారీ మార్జిన్లతో గెలవాల్సి ఉంటుంది.
గత పది మ్యాచ్‌లలో ఏడు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో భారత్ ఇప్పుడు ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది.
కాన్పూర్ టెస్ట్ మొదటిరోజు ఆట కూడా వర్షం వల్ల దెబ్బతింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్, ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ కేవలం 35 ఓవర్లు మాత్రమే ఆడి 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. మొమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీమ్ (6) క్రీజ్‌లో ఉన్నారు.
మొదటిరోజు ఆటలో భారత పేసర్ ఆకాశ్ దీప్ కేవలం 34 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసాడు. జకీర్ హసన్‌ను డకౌట్ చేసాడు. 36 బంతుల్లో 4 బౌండరీలతో 24 పరుగులు చేసిన షద్మన్ ఇస్లాంను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత, 57 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసిన స్కిప్పర్ నజ్ముల్ హుసేన్ శాంతోను రవిచంద్రన్ అశ్విన్ ఔట్ చేసాడు.
రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సీరీస్‌లో భారత్ మొదటి టెస్ట్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది.