అన్యమతస్థుల డిక్లరేషన్ కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతాల వారి కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయనుంది. హిందూయేతరులు తిరుమల వచ్చినప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలను ఆ బోర్డుల్లో వివరించనున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం విశ్రాంతి భవనం వద్ద ఈ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతీ ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు.
వైసీపీ అధినేత జగన్ తిరుమలకు వెళ్ళేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ సమయంలో బోర్డుల ఏర్పాటు నిర్ణయం టీటీడీ తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.