Thursday, June 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

డిక్లరేషన్ సంప్రదాయమా…? రాజకీయమా…?

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటనపై దుమారం

T Ramesh by T Ramesh
Sep 27, 2024, 02:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుమల డిక్లరేషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని తేలింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. వైసీపీ వెర్సెస్ ఎన్డీయే కూటమి మధ్య పరస్పర విమర్శల యుద్ధం భీకరంగా జరగుతోంది.

శ్రీవారి ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవునెయ్యి లో కల్తీ జరిగిందని అందులో అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని టీటీడీ విచారణలో తేలింది. తమకు అందిన ల్యాబ్ రిపోర్టులోని విషయాలను టీటీడీ ఈవో మీడియాకు వివరించారు.

అయితే వైసీపీ హయాంలోనే తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిందని టీడీపీ ఆరోపించింది. అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్లే తిరుమల పవిత్రతను కూడా వైసీపీ దెబ్బతీసిందని ఏపీ ఎన్డీయే ప్రభుత్వం ఆరోపించింది.

తిరుమలలో జరిగిన అపచారం ప్రక్షాళనకు గాను జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయ మెట్లు కడిగారు. లౌకికవాదం పేరిట హిందువుల ఆచారాలను అవహేళన చేయడం సరికాదని హితవు పలికారు. తెలిసితెలియకుండా సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు చేసి చులకన కావద్దని హెచ్చరించారు.

బీజేపీ కూడా ఈ విషయంలో జగన్ ను తీవ్రంగా తూర్పారబట్టింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది.

 అన్యమతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే  కచ్చితంగా అఫిడవిట్‌ సమర్పించాలని టీటీడీ  చెబుతోంది. దేవాదాయశాఖ చట్టం 30/1987ని అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. ఈ నిబంధన మేరకు  హిందూ యేతరులు లేదా అన్యమతస్థులు.. తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్‌ ఫారంపై సంతకం చేయాల్సి ఉంది.  తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తిని అయినప్పటికీ శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు నమోదు చేసి సంతకం చేయాలి.

గతంలో సోనియా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాంతో పాటూ పలువురు ప్రముఖులు సైతం డిక్లరేషన్ సమర్పించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

తిరుమల వచ్చే అన్యమతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్‌మెంటు దగ్గర డిక్లరేషన్‌పై సంతకం చేయాలి.  వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే గెస్ట్‌హౌస్ దగ్గరకు వెళ్లి సంతకాలు చేయించుకుంటారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ , తిరుమల వస్తే గెస్ట్‌హౌస్‌ దగ్గరకు వెళ్లి టీటీడీ నిబంధనలు, దేవాదాయశాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్‌పై సంతకం చేయాలని అడగనున్నట్లు సమాచారం.

 వైసీపీ  ఐదేళ్ల పాలనలో జగన్‌ పలు సందర్భాల్లో శ్రీవారి దర్శనానికి వచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో.. టీటీడీ ఆయను డిక్లరేషన్‌ కోరలేదు.

ప్రస్తుతం కూడా తమ నేత జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వరని ఆ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు.

తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లోకి లాగడం ఏంటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు చేసిన పాపాల ప్రక్షాళన కోసం ప్రార్థించేందుకే తమ అధినేత ఏడుకొండలకు వస్తున్నారని చెప్పారు.

అయితే ఈ వివాదంపై స్పందించిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తిరుమల డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందని  తెలిపారు.

Tags: AP NDA GOVTBJPDECLARATIONJANASENALaddu PrasadamSLIDERTDPTOP NEWSTTDYSRCP
ShareTweetSendShare

Related News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?
general

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.