జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ ఇవాళ జమ్మూకశ్మీర్‌లోని ఏడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. రియాసీ వద్ద తీర్థయాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి కేసు విచారణలో భాగంగా ఆ సోదాలు చేపట్టింది.
ఈ తెల్లవారుజామున ప్రారంభమైన సోదాలు మధ్యాహ్నం 12 గంటల సమయానికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. బస్సుపై ఉగ్రవాదులు, ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఎన్ఐఎ ఈ సోదాలు నిర్వహిస్తోంది. రాజౌరీ, రియాసీ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
రియాసీ ఉగ్రదాడి కేసుకు సంబంధించి ఎన్ఐఎ ఈ యేడాది జూన్ 30న కూడా రాజౌరీ జిల్లాలోని పలు ప్రాంతాలను జల్లెడ పట్టింది.
ఈ యేడాది జూన్ 9 సాయంత్రం జమ్మూకశ్మీర్‌లో రియాసీ జిల్లాలోని పౌనీ ప్రాంతంలో హిందూభక్తులు ప్రయాణం చేస్తున్న ఒక బస్సు మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోయి, తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 30మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటనకు సంబంధించి ఎన్ఐఎ దర్యాప్తు జూన్ 15న మొదలైంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు