శ్రీశైలంలో హుండీల ద్వారా దేవస్థానానికి రూ.4,00,65,375 ఆదాయం లభించిందని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆలయంలోని హుండీల ద్వారా రూ.3,86,82,321లు, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.13,83,054, మొత్తం 4,00,65,375 ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 25వరకు భక్తులు సమర్పించిన మొత్తాన్ని గురువారం లెక్కించారు. .
ఈ మొత్తంతో పాటు 488 యుఎస్ఏ డాలర్లు, 12 కువైట్స్ దినార్స్, ఆరువేల ఉగాండా షిలింగ్స్, 30 యుకే పౌండ్సు, 60 సింగపూర్ డాలర్లు, 20 హంకాంగ్ డాలర్లు 10 ఈరోస్, 20 మలేషియా రింగిట్స్ , ఇతర దేశాల కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని పేర్కొన్నారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాల నిఘా మధ్య కానుకల లెక్కింపు జరిగింది. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఆర్. రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.