రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి మధ్య 42 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు ఈ రైళ్ళ రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో కాచిగూడ-నిజామాబాద్, మేడ్చల్-లింగంపల్లి, మేడ్చల్-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య 12 రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకు రైళ్ళ రద్దు కొనసాగుతుందని స్పష్టం చేశారు.