తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారని, ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరగకుండానే జరిగిందని చంద్రబాబు చెబుతున్నారని జగన్ అన్నారు.
రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రత, స్వామివారి ప్రసాదం విశిష్టత, వెంకటేశ్వరస్వామి వైభవంపై రాజకీయల కోసం అబద్ధాలడటం సరికాదన్నారు. టీటీడీ పేరు ప్రఖ్యాతులు, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రత విషయంలో కూడా రాజకీయ దుర్బుద్ధితో అబద్ధాలడటం సరికాదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకుగాను సెప్టెంబరు 28, శనివారం రోజున రాష్ట్రంలోని ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైఎస్సార్సీపీ కేడర్ కు పిలుపునిచ్చారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు