కేరళలో మంకీపాక్స్ కేసు నమోదు కలకలం రేపుతోంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇటీవల కేరళలోని మలప్పురానికి వచ్చిన ఓ స్థానికుడికి మంకీపాక్స్ వైరస్‌లోని క్లేడ్-1బీ రకం సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఈ రకం స్టెయిన్‌కు సంబంధించి దేశంలో నమోదైన తొలి కేసు ఇదేకావడం ఆందోళన కలిగిస్తోంది.
బాధితుడి వయస్సు 38 ఏళ్ళు కాగా వారం రోజుల క్రితమే వైరస్ అతడికి సోకినట్లు నిర్ధారించారు. ఈ నెల 9న విదేశాల నుంచి దిల్లీకి వచ్చిన ఓ వ్యక్తికి క్లేడ్-2 రకం వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ రకం స్టెయిన్ ప్రస్తుతం పశ్చిమాఫ్రికాలో వ్యాప్తిలో ఉంది.