తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాజమండ్రి శివారు ప్రాంతమైన దివాన్ చెరువు అటవీ ప్రాంతం నుంచి కడియం వైపు మళ్ళింది. అక్కడ జనావాసాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కడియపు లంక దోసాలమ్మ కాలనీలో చిరుతను చూసిన రైతు అధికారులకు సమాచారం అందజేశాడు.
హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా అటవీ అధికారి భరణి, పాదముద్రలు సేకరించారు. సంచరించిన జంతువు చిరుతగా నిర్ధారించారు. నర్సరీ కూలీలకు సెలవు ప్రకటించారు.
ఆలమూరు మండలం గోదావరి తీరం వైపునకు చిరుత వెళుతుందని అంచనా వేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. నివాసాల దగ్గర రాత్రి సమయంలో లైట్లు వేసి ఉంచాలని తెలిపారు. చిరుత గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు