జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
రెండో విడతలో భాగంగా పీర్‌పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బడ్‌గావ్, రాజౌరి, పూంఛ్, గండేర్‌బల్, రియాసి జిల్లాల పరిధిలోని 26 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడుగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఈ 26 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25.78 లక్షల మంది ఓటర్లు తీర్పు చెప్పనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నారు.
మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా తదితర నేతలు ఈ విడతలో పోటీలో ఉన్నారు.
ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్‌లో 61.38 శాతం ఓటింగ్ నమోదు కాగా అక్టోబర్ 1న మూడో విడతలో భాగంగా మిగిలిన 40 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు