రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్ళు, ఇనుపరాడ్లు, సిమెంట్ ఇటుకలు పెట్టి ప్రమాదాలు జరపాలనే ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. కుట్ర ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాల యంత్రాంగం, పోలీసులతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. ఉద్దేశపూర్వకంగా రైలు ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించిన అశ్విన వైష్ణవ్, . ఎన్ఐఏ కూడా ఇందులో భాగస్వామ్యమైందన్నారు. ప్రమాదాలకు ప్రయత్నించే వారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు