శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే 1994 నుంచి2000 వరకు ప్రధానిగా చేశారు. ప్రస్తుతం నేషనల్ పీపుల్స్ పవర్ (NPP)కి చెందిన 54 ఏళ్ళ హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఇద్దరు నేతలను కేబినెట్ మంత్రులుగా నియమించారు. శ్రీలంకలో అధ్యక్షుడు దిసనాయకేతో పాటు మొత్తం నలుగురితో కూడిన కేబినెట్ కొలువుదీరింది.
ప్రధాని హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు శాఖలు కేటాయించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేశారు.
హక్కుల కార్యకర్తగా, యూనివర్శిటీ అధ్యాపకురాలిగా పనిచేసిన హరిణి, ప్రధానిగా నియమితులై చరిత్ర సృష్టించారు. ఎంపీలు విజిత హెరాత్, లక్ష్మణ్ నిపుణరచిచి కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం పార్లమెంటును రెండు రోజుల్లో రద్దు చేస్తామని ఆ దేశ కొత్త అధ్యక్షుడు దిసనాయకే తెలిపారు. దీంతో పార్లమెంటు ఎన్నికలు నవంబర్లో జరిగే అవకాశం ఉంది.