ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధరల పెరుగుదలను అడ్డుకునేందుకు బఫర్‌స్టాక్‌ను హోల్‌సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఎగుమతులపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో, ఇటీవల ఉల్లి ధరలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లోని బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.100కు చేరువవుతోంది. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది.
ప్రధాన నగరాల్లోని హోల్‌సేల్ మార్కెట్లోకి బఫర్ స్టాక్‌ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి నిధి ఖరే తెలిపారు.
దేశవ్యా వప్తంగా రాయితీపై ఉల్లిని రిటైల్‌గా విక్రయించే ఆలోచన కూడా కేంద్రం చేస్తోంది. ప్రస్తుతం 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం దిల్లీలో కిలో ఉల్లి ధర రూ.55 ఉండగా ముంబైలో రూ. 58కి చేరింది. చెన్నైలో రూ.60, హైదరాబాద్‌లో రూ. 60 చొప్పున అమ్ముతున్నారు.
ఉల్లిపై ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా దిల్లీ సహా ఇతర రా ష్ట్రాల రాజధానుల్లో రూ. 35 చొప్పును అమ్ముతున్నారు. జాతీయ సగటు కంటే ఉల్లి ధర ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ విధమైన విక్రయాలు జరుగుతున్నాయి.