అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేద్ర మోదీ న్యూయార్క్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. నెల రోజుల వ్యవధిలోనే ఆ ఇద్దరూ రెండోసారి సమావేశం అయ్యారు. గడిచిన మూడు నెలల్లో మోదీ, జెలెన్‌స్కీ మూడోసారి భేటీ అయ్యారు. సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ లో భాగంగా ఈ పరిణామం జరిగింది.
ఉక్రెయిన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి భారత్ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని మోదీ చెప్పారు.
ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు తగిన చర్యలు చేపడతామని ప్రకటించారు