ఆంధ్రప్రదేశ్ లో వానలు జోరందుకోనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఒడిశా, ఏపీ తీరం వైపు పయనించే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశాలు లేవనీ స్పష్టం చేసింది. అల్పపీడనం లేదా వాయుగుండంగా మాత్రమే బలపడుతుందని అంచనావేసింది.
అల్పపీడన ప్రభావంతో నేడు ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే సూచనలున్నాయి.