బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించినట్లు లోక్ సభ స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
పురందేశ్వరి ఈ పదవిలో రెండేళ్ళ పాటు అంటే 2026 వరకు కొనసాగనున్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ కమిటీ భారత ప్రాంతీయ ప్రతినిధిగానూ ఆమె నామినేట్ అయ్యారు.
పురందరేశ్వరికి కేంద్రకేబినెట్ లో చోటుదక్కుతుందని, స్పీకర్ పదవి కూడా దక్కవచ్చు అని ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రచారం జరిగింది.